PH

testwiki నుండి
Jump to navigation Jump to search
కొన్ని సాధారణ పదార్ధాల pH విలువలు

రసాయన శాస్తంలో, pH ( /p i eɪ tʃ / ) జలద్రావణాల ఆమ్ల, క్షార గాఢతను తెలియజేసే స్కేలు. ఆమ్లద్రావణాలు తక్కువ pH, క్షార ద్రావణాలు ఎక్కువ pH కలిగి ఉంటాయి. గది ఉష్ణోగ్రత (25 ° C లేదా 77 ° F) వద్ద స్వచ్ఛమైన నీరు ఆమ్లము గాని, క్షారమూ కాని కాదు. దాని pH విలువ 7 ఉంటుంది.

pH విలువ ఆ ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలియజేస్తుంది. తక్కువ pH విలువ ఉంటే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ గాఢత ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమాన్ని pH గా నిర్వచిస్తారుమూస:Efn.[1]

25 °C ల వద్ద   7 కన్నా తక్కువ pH ఉన్న ద్రావణాలు ఆమ్లత్వాన్ని, 7 కన్నా ఎక్కువ pH ఉన్న ద్రావణాలు క్షారత్వాన్ని ప్రదర్శిస్తాయి. pH తటస్థవిలువ ఆ ద్రావణ ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే pH విలువ 7 కంటే తక్కువ అవుతుంది. గాఢ ఆమ్లం pH విలువ 0 కంటే తక్కువగా ఉంటుంది. గాఢ క్షారం pH విలువ 14 కంటే ఎక్కువ.[2]

అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ప్రామాణిక ద్రావణాల సమూహానికి పిహెచ్ స్కేల్ గుర్తించబడింది . [3] జల ద్రావణాల pH గాజు ఎలక్ట్రోడ్లు, pH మీటర్ల ద్వారా కొలుస్తారు. రసాయన శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం, మందులు, నీటి శుద్ధి మొదలైన రంగాలలో pH విలువల ఉపయోగం ఉంది.

చరిత్ర

పిహెచ్ భావనను మొదట డానిష్ రసాయన శాస్త్రవేత్త సోరెన్ పెడర్ లౌరిట్జ్ సోరెన్సేన్ 1909 లో కార్ల్‌స్‌బెర్గ్ ప్రయోగశాలలో ప్రవేశపెట్టాడు [4] విద్యుత్ రసాయన కణాల పరంగా నిర్వచనాలు, కొలతలకు అనుగుణంగా 1924 లో ఆధునిక పిహెచ్ కు సవరించబడింది. మొదటి పేపర్లలో, సంజ్ఞామానం చిన్న అక్షర p కు పాదాంకంగా H ను కలిగి ఉండేది: p H.

pH లోని p ఖచ్చితమైన అర్ధం వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే సోరెన్‌సెన్ దానిని ఎందుకు ఉపయోగించాడో వివరించలేదు. [5] పొటెన్షియల్ భేదాలను ఉపయోగించి దానిని కొలిచే మార్గాన్ని అతను వివరించాడు. ఇది హైడ్రోజన్ అయాన్ల గాఢతకు 10 యొక్క ఋణ ఘాతాన్ని సూచిస్తుంది.

"p" ఫ్రెంచ్ భాషలో puissance, జర్మన్ భాషలో Potenz, డేనిష్ భాషలో potens అయి ఉండవచ్చు. ఆయా భాషలలో ఆ పదానికి అర్థం "పవర్".[6]

నిర్వచనం, కొలత

pH

ఒక జల ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని pH గా వ్యవహరిస్తారు. [3]

pH=log10(aHA+)=log10(1aHA+)

ఉదాహరణకు, ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత మూస:Math అయితె దాని

pH=log10(5X106)= 5.3

మూలాలు

మూస:Reflist

  1. Bates, Roger G. Determination of pH: theory and practice. Wiley, 1973.
  2. మూస:Cite journal
  3. 3.0 3.1 మూస:Cite journal
  4. మూస:Cite journal Two other publications appeared in 1909, one in French and one in Danish.
  5. మూస:Cite journal
  6. మూస:Cite journal
"https://te.wiki.beta.math.wmflabs.org/w/index.php?title=PH&oldid=281" నుండి వెలికితీశారు