సూర్యుడు

testwiki నుండి
Jump to navigation Jump to search

మూస:Solar System Infobox/Sun ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్, హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. భూమి భ్రమణం వల్లనే సూర్యోదయాస్తమయాలు వస్తాయి.

సూర్యుని వివరాలు

దస్త్రం:Incandescent Sun.ogv
ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అభివృద్ధి పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలో వ్యవదిలో సూర్యుని పరిశీలించి రూపొందించారు.
  1. భూమి నుండి సూర్యుడి దూరం: 149.8 మిలియన్ కిలోమీటర్లు.
  2. కాంతి ఆవరణ ఉష్ణోగ్రత: 6000 సెంటి గ్రేడ్ డిగ్రిలు.
  3. సూర్యుని వ్యాసం:13,91,980 కిలో మీటర్లు. (సౌర వ్యాసార్థం)
  4. సూర్యుని వయస్సు: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.
  5. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.
  6. సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సౌర తుఫాను

సౌర వ్యాసార్థం

సూర్యుడి ఫోటోస్ఫియర్ వరకు ఉన్న వ్యాసార్థాన్ని, సౌర వ్యాసార్థం అంటారు. దీని విలువ:

1R=6.957×105 km

సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.


ఇవి కూడా చూడండి

ఆధారాలు


మూస:సౌరకుటుంబం