శక్తి నిత్యత్వ నియమం
శక్తి నిత్యత్వ నియమం ప్రకారం వేరే వ్యవస్థలతో సంబంధం లేని ఒక ఏకాకి వ్యవస్థలోని శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.[1] శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, దానిని కేవలం ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలము. ఉదాహరణకు ఒక డైనమైట్ విస్ఫోటనం చెందితే అందులోని రసాయన శక్తి, గతి శక్తిగా మార్పు చెందుతుంది.
సాంప్రదాయకంగా శక్తి నిత్యత్వ నియమం, ద్రవ్యనిత్యత్వ నియమం కంటే భిన్నమైనది. అయితే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంత ప్రతిపాదనలో పార్స్ చెయ్యలేకపోయాం (Conversion error. Server ("https://wikimedia.org/api/rest_") reported: "Class "Wikibase\Client\WikibaseClient" not found"): {\displaystyle E=mc^{2}} సూత్రం ద్వారా ద్రవ్యరాశికీ, శక్తికీ సంబంధం ఉందని నిరూపించాడు. దీని ప్రకారం ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం శక్తి, ద్రవ్యరాశి రెండింటినీ కలిపి స్థిరంగా ఉంటాయని భావిస్తుంది. సైద్ధాంతికంగా ద్రవ్యరాశి కలిగిన ఏ వస్తువునైనా శుద్ధ శక్తి రూపంలోకి మార్చవచ్చు, అలాగే శక్తిని కూడా ద్రవ్యరాశి కలిగిన పదార్థంగా మార్చవచ్చు. కానీ ఇది జరగడానికి అత్యంత తీవ్రమైన భౌతిక పరిస్థితులు కావాలి. అవి ఎలాంటివి అంటే మహా విస్ఫోటనం సంభవించిన కొంత సేపటి తర్వాతనో, లేదా కృష్ణ బిలాలు హాకింగ్ రేడియేషన్ విడుదల చేస్తున్నప్పటి పరిస్థితులు.
శక్తి నిత్యత్వ నియమం పర్యవసానంగా నిరంతరంగా పనిచేసే యంత్రాన్ని మనం నిర్మించలేము. అంటే బయటి నుంచి లభించే శక్తి ప్రమేయం లేకుండా ఎల్లప్పుడూ తన పరిసరాలకు శక్తిని అందించగల వ్యవస్థ ఏదీ ఉండజాలదు.[2]
చరిత్ర
సా.శ.పూ 550 నుంచే కొంతమంది గ్రీకు తత్వవేత్తలు సృష్టిలో ప్రతి పదార్థానికి మూలాధారమైన, శాశ్వతమైన ఒక మూల పదార్థం ఉందని భావించారు. అయితే వారికి అప్పుడు ద్రవ్యరాశి, శక్తి లాంటి భావనలు తెలియదు కాబట్టి ఒక్కో తత్వవేత్త ఒక్కో మూల పదార్థాన్ని ఊహించారు. ఉదాహరణకు మూల పదార్థాన్ని థేల్స్ నీరు అనుకున్నాడు. ఎంపిడోక్లెస్ నేల, గాలి, నీరు, అగ్ని మూలపదార్థాలు అనుకున్నాడు.[3]
మూలాలు
- ↑ మూస:Cite book
- ↑ Planck, M. (1923/1927). Treatise on Thermodynamics, third English edition translated by A. Ogg from the seventh German edition, Longmans, Green & Co., London, page 40.
- ↑ మూస:Cite journal