దామోదర్ ధర్మానంద కోశాంబి
మూస:Infobox person దామోదర్ ధర్మానంద కోశాంబి (1907 జూలై 31 - 1966 జూన్ 29) గణితం, గణాంకాలు, భాషా శాస్త్రం, చరిత్ర, జన్యుశాస్త్రంలో ఆసక్తి ఉన్న భారతీయ బహురంగాల శాస్త్రజ్ఞుడు. కోశాంబి మ్యాప్ ఫంక్షన్‌ను ప్రవేశపెట్టి జన్యుశాస్త్రాభివృద్ధికి తోడ్పడ్డాడు.[1] అతను నామిస్మాటిక్స్‌లో చేసిన కృషికి, ప్రాచీన సంస్కృత గ్రంథాలపై విమర్శనాత్మక సంచికలను సంకలనం చేయడానికి కూడా ప్రసిద్ది చెందాడు. అతని తండ్రి, ధర్మానంద దామోదర్ కోశాంబి, బౌద్ధమతం, పాళీ భాషలో బౌద్ధ సాహిత్యంపై ప్రత్యేక ప్రాధాన్యతతో ప్రాచీన భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. దామోదర్ కోశాంబి తన దేశ ప్రాచీన చరిత్రపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా తండ్రిని అనుసరించాడు. అతను పురాతన భారతదేశంలో ప్రత్యేకత కలిగిన మార్క్సిస్ట్ చరిత్రకారుడు. అతను తన పనిలో చారిత్రక భౌతికవాద విధానాన్ని ఉపయోగించాడు.[2] కోశాంబి ప్రత్యేకంగా తన రచన యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీకి ప్రసిద్ధి చెందాడు.
అతన్ని "మార్క్సిస్ట్ స్కూల్ ఆఫ్ ఇండియన్ హిస్టారియోగ్రఫీకి పితృపాదుడు"గా వర్ణించారు.[3] కోశాంబి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధానాలను విమర్శించాడు. కోశాంబి ప్రకారం నెహ్రూ, ప్రజాస్వామ్య సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించాడు. చైనా కమ్యూనిస్ట్ విప్లవం పట్ల, దాని ఆదర్శాల పట్లా కోశాంబి ఆకర్షితుడయ్యాడు. అతను ప్రపంచ శాంతి ఉద్యమంలో ప్రముఖ కార్యకర్త కూడా.
తొలి జీవితం
దామోదర్ ధర్మానంద కోశాంబి పోర్చుగీస్ గోవాలోని కోస్బెన్‌లో ధర్మానంద దామోదర్ కోశాంబికి సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భారతదేశంలో కొన్ని సంవత్సరాల పాఠశాల విద్య తర్వాత, 1918 లో, దామోదర్, అతని అక్క మాణిక్ లు కేంబ్రిడ్జ్ లాటిన్ స్కూల్‌లో ఉపాధ్యాయ పదవిని చేపట్టిన తండ్రితో కలిసి అమెరికా లోని, మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్ వెళ్లారు.మూస:Sfn వారి తండ్రికి హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ చార్లెస్ రాక్‌వెల్ లాన్‌మాన్ బౌద్ధ తత్వశాస్త్రంపై విశుద్ధిమగ్గ అనే పుస్తకపు క్లిష్టమైన ఎడిషన్‌ను సంకలనం చేసే పనిని ఇచ్చారు. దీనిని మొదట హెన్రీ క్లార్క్ వారెన్ ప్రారంభించారు. అక్కడ యువ దామోదర్, గ్రామర్ పాఠశాలలో ఒక సంవత్సరం చదివి, 1920 లో కేంబ్రిడ్జ్ హై అండ్ లాటిన్ స్కూల్‌లో చేరాడు. అతను అమెరికన్ బాయ్ స్కౌట్స్ వారి కేంబ్రిడ్జ్ శాఖలో సభ్యుడయ్యాడు.
కేంబ్రిడ్జ్‌లో అతను ఆ కాలపు మరో అద్భుత వ్యక్తి నార్బర్ట్ వీనర్‌తో స్నేహం చేశాడు, అతని తండ్రి లియో వీనర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కోశాంబి తండ్రికి సహోద్యోగి. కోశాంబి తన చివరి పాఠశాల పరీక్షలో ప్రతిభ కనబరచి, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు అవసరమైన ప్రవేశ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించనవసరం లేకుండా మెరిట్ ఆధారంగా మినహాయింపు పొందిన కొద్దిమంది అభ్యర్థులలో ఒకడు. 1924 లో అతను హార్వర్డ్‌లో చేరినప్పటికీ, కొన్నాళ్ళ తరువాత చదువును వాయిదా వేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికి గుజరాత్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తన తండ్రి వద్దే ఉన్నాడు. అతని తండ్రి మహాత్మా గాంధీకి సన్నిహిత వర్గాలలో ఉన్నాడు.
1926 జనవరిలో కోశాంబి, తండ్రితో కలిసి అమెరికాకి తిరిగి వెళ్ళాడు. మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడాదిన్నర పాటు చదువుకున్నాడు. కోశాంబి జార్జ్ డేవిడ్ బిర్కాఫ్ వద్ద గణితం అభ్యసించాడు. కోశాంబి గణితంపై దృష్టి పెట్టాలని బిర్కాఫ్ కోరుకున్నాడు, కానీ కోశాంబి అనేక కోర్సుల్లో రాణిస్తూ అనేక విభిన్న కోర్సులు చేశాడు. 1929 లో హార్వర్డ్ అతనికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సుమా కమ్ లాడ్‌తో ప్రదానం చేసింది. అమెరికా లోని పురాతన అండర్ గ్రాడ్యుయేట్ ఆనర్స్ ఆర్గనైజేషన్ అయిన ఫై బీటా కప్పా సొసైటీలో కూడా అతనికి సభ్యత్వం లభించింది. ఆ తరువాత కొద్దికాలానికే కోశాంబి భారతదేశానికి తిరిగి వచ్చాడు.
బెనారస్, అలీగఢ్
అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో (BHU) ప్రొఫెసరుగా గణితంతో పాటు జర్మన్ కూడా బోధించాడు. అతను తన పరిశోధనను సొంతంగా కొనసాగించడానికి చాలా కష్టపడ్డాడు. 1930 లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్‌లో తన మొదటి పరిశోధనా పత్రం "ప్రెసెషన్స్ ఆఫ్ యాన్ ఎలిప్టిక్ ఆర్బిట్" ప్రచురించాడు.
1931 లో కోశాంబి, సంపన్న మడ్గావ్కర్ కుటుంబానికి చెందిన నళినిని వివాహం చేసుకున్నాడు. ఈ సంవత్సరంలోనే గణిత శాస్త్రజ్ఞుడు ఆండ్రే వెయిల్, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్, గణితంలో లెక్చరర్‌షిప్‌గా నియమితుడయ్యాడు.[4] అప్పట్లో అలీగఢ్‌లో అతని సహచరుల్లో తిరుక్కన్నపురం విజయరాఘవన్ కూడా ఉన్నాడు. అలీగఢ్‌లో ఉన్న రెండు సంవత్సరాలలో అతను, డిఫరెన్షియల్ జామెట్రీ, పాత్ స్పేసెస్ లో ఎనిమిది పరిశోధనా పత్రాలను రూపొందించాడు. అనేక యూరోపియన్ భాషలలో అతనికి గల నైపుణ్యం కారణంగా తన ప్రారంభ పత్రాలను ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ జర్నళ్ళలో ప్రచురించాడు.
గణితం
1932లో, అతను పుణెలోని డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. అక్కడ అతను 14 సంవత్సరాలు గణితం బోధించాడు.మూస:Sfn 1935 లో అతని పెద్ద కూతురు మాయ, 1939 లో చిన్న కూతురు మీరా జన్మించారు.1944 లో అతను ది ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్ ఫ్రమ్ రీకాంబినేషన్ వాల్యూస్ ఇన్ యాన్నల్స్ ఆఫ్ యుజెనిక్స్ అనే శీర్షికతో 4 పేజీల చిన్న వ్యాసం ప్రచురించాడు. అందులో అతను పరిచయం చేసిన సమీకరణం ఆ తరువాత కోశాంబి మ్యాప్ ఫంక్షన్‌గా పేరుపొందింది. అతని సమీకరణం ప్రకారం, జన్యు పటం దూరం (w), పునఃసంయోగ భిన్నానికి (θ) సంబంధం క్రింది విధంగా ఉంటుంది:
లేదా, మరొక విధంగా చెప్పాలంటే,
గణాంకాలలో కోశాంబి చేసిన అత్యంత ముఖ్యమైన కృషి ప్రాపర్ ఆర్తోగోనల్ డికంపోజిషన్ (POD) అని పేరున్న సాంకేతికత. దీనిని వాస్తవానికి 1943 లో కోశాంబి అభివృద్ధి చేసినప్పటికీ, ఇప్పుడు దీనిని కర్హునెన్-లోవే విస్తరణగా సూచిస్తారు. జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో సమర్పించబడిన 'స్టాటిస్టిక్స్ ఇన్ ఫంక్షన్ స్పేస్' పేరుతో 1943 పేపర్‌లో కోశాంబి, కర్హునెన్ (1945) లోవ్ (1948) ల కంటే కొన్ని సంవత్సరాల ముందు సరైన ఆర్థోగోనల్ డికంపోజిషన్‌ను సమర్పించాడు. ఈ సాధనానికి ఇమేజ్ ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, డేటా కంప్రెషన్, ఓషనోగ్రఫీ, కెమికల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ వంటి విభిన్న రంగాలలో అనువర్తనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు POD పద్ధతిని ఉపయోగించే చాలా పేపర్‌లలో అతని ఈ ఈ అతి ముఖ్యమైన సమర్పణకు గుర్తింపు లభించలేదు. అయితే ఇటీవలి సంవత్సరాలలో, కొంతమంది రచయితలు దీనిని కోశాంబి-కర్హునెన్-లవ్ డీకంపోజిషన్ అని పేర్కొన్నారు.[5]
చరిత్ర అధ్యయనం
1939 వరకు, కోశాంబి దాదాపు పూర్తిగా గణిత శాస్త్ర పరిశోధనపై దృష్టి సారించాడు కానీ తరువాత, అతను క్రమంగా సామాజిక శాస్త్రాల లోకి ప్రవేశించడం ప్రారంభించాడు.మూస:Sfn నుమిస్మాటిక్స్‌లో అతని అధ్యయనాలు అతనిని చారిత్రక పరిశోధన రంగంలోకి తీసుకెళ్ళాయి. అతను క్లిష్టమైన న్యూమిస్మాటిక్స్ శాస్త్రంలో విస్తృతమైన పరిశోధన చేసాడు. అతని డేటా మూల్యాంకనం ఆధునిక గణాంక పద్ధతుల ద్వారా జరిగింది.[6] ఉదాహరణకు, అతను వివిధ భారతీయ మ్యూజియంల నుండి వేలకొద్దీ పంచ్-మార్క్ చేయబడిన నాణేల బరువును గణాంకపరంగా విశ్లేషించి, వాటి కాలక్రమానుసారాన్ని స్థాపించాడు. ఈ నాణేలు ముద్రించబడే ఆర్థిక పరిస్థితుల గురించి తన సిద్ధాంతాలను ముందుకు తెచ్చాడు.మూస:Sfn
సంస్కృతం
అతను సంస్కృతం, ప్రాచీన సాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ప్రాచీన కవి భర్తృహరిపై తన క్లాసిక్ రచనను ప్రారంభించాడు. అతను 1945-1948 సమయంలో భర్తృహరి శతకత్రయం, సుభాషితాలపై శ్రేష్టమైన విమర్శనాత్మక సంచికలను ప్రచురించాడు.
సామాజిక కృషి
ఈ కాలంలోనే అతను తన రాజకీయ కార్యాచరణను ప్రారంభించాడు, కొనసాగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంలో, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో తీవ్రవాద ప్రవాహాలకు దగ్గరగా వచ్చాడు. అతను మార్క్సిస్టుగా మారి, కొన్ని రాజకీయ వ్యాసాలు రాశాడు.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
1940 లలో హోమీ జె. భాభా కోశాంబిని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో చేరమని ఆహ్వానించాడు. కోశాంబి 1946లో TIFRలో గణిత శాస్త్రానికి చైర్‌గా చేరాడు. తదుపరి 16 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. అతను పూణేలోనే, తన స్వంత ఇంటిలోనే నివసించేవాడు. డెక్కన్ క్వీన్ రైలులో ప్రతిరోజూ ముంబైకి వెళ్లేవాడు.మూస:Sfn
స్వాతంత్ర్యం తర్వాత, 1948-49లో కంప్యూటింగ్ మెషీన్‌ల సైద్ధాంతిక, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి అతను యునెస్కో ఫెలోగా ఇంగ్లాండ్, అమెరికా వెళ్ళాడు. లండన్‌లో, అతను ఇండాలజిస్టు, చరిత్రకారుడూ అయిన AL బాషమ్‌తో తన దీర్ఘకాల స్నేహాన్ని ప్రారంభించాడు. 1949 వసంతకాల సెమిస్టర్‌లో, అతను చికాగో విశ్వవిద్యాలయంలో గణిత విభాగంలో జ్యామితి విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. హార్వర్డ్ రోజుల నుండి అతని సహోద్యోగి అయిన మార్షల్ హార్వే స్టోన్, ఆ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1949 ఏప్రిల్-మేలో అతను, న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీలో దాదాపు రెండు నెలలు గడిపాడు, J. రాబర్ట్ ఓపెన్‌హైమర్, హెర్మాన్ వెయిల్, జాన్ వాన్ న్యూమాన్, మార్స్టన్ మోర్స్, ఓస్వాల్డ్ వెబ్లెన్, లుడ్విగ్ సీగెల్ వంటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులతో సంభాషించాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులలో, అతను ప్రపంచ శాంతి ఉద్యమంలోకి ఆకర్షితుడయ్యాడు. ప్రపంచ శాంతి మండలి సభ్యునిగా పనిచేశాడు. అతను శాంతి కోసం అలుపులేని ప్రయత్నం చేసాడు. ప్రపంచ అణ్వస్త్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. భారతదేశ ఇంధన అవసరాలకు కోశాంబి చూపిన పరిష్కారం భారత పాలక వర్గపు ఆశయాలతో విరుద్ధంగా ఉండేది. అతను సౌర విద్యుత్తు వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రతిపాదించాడు. శాంతి ఉద్యమంలో అతని క్రియాశీలతలో భాగంగా అతను బీజింగ్, హెల్సింకి, మాస్కోలకు వెళ్ళాడు. అయితే, ఈ కాలంలో అతను తన విభిన్న పరిశోధనా ఆసక్తులను కూడా నిరంతరం కొనసాగించాడు. మరీ ముఖ్యంగా, అతను ప్రాచీన భారతీయ చరిత్రను మార్క్సిస్ట్‌గా తిరిగి వ్రాయడంలో పనిచేశాడు. ఇది, భారతీయ చరిత్ర అధ్యయనానికి పరిచయం (1956) అనే పుస్తక ప్రచురణగా ఫలించింది.
అతను 1952-62 కాలంలో అనేకసార్లు చైనా సందర్శించాడు. చైనా విప్లవాన్ని చాలా దగ్గరగా చూడగలిగాడు. ఆధునీకరణ, అభివృద్ధిల పట్ల భారత పాలక వర్గాలు ఊహించిన, అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించాడు. ఇవన్నీ భారత ప్రభుత్వంతో, భాభాతో అతని సంబంధాలు దెబ్బతినడానికి కారణమయ్యాయి. చివరికి 1962 లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి కోశాంబి నిష్క్రమించాడు.
TIFR తర్వాత రోజులు
TIFR నుండి అతని నిష్క్రమణతో కోశాంబికి పురాతన భారతీయ చరిత్రలో తన పరిశోధనపై దృష్టి సారించే అవకాశం లభించింది. ఈ పరిశోధన ఫలితంగా ది కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిని 1965 లో రౌట్‌లెడ్జ్, కెగన్ & పాల్ సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ భాషలలోకి అనువాదమై, విస్తృతంగా ప్రశంసలు పొందింది. అతను పురావస్తు అధ్యయనాలలో తన సమయాన్ని ఉపయోగించాడు. గణాంకాలు, సంఖ్య సిద్ధాంత రంగంలో తన వంతు సహకారం అందించాడు. న్యూమిస్మాటిక్స్‌పై అతని వ్యాసం 1965 ఫిబ్రవరిలో సైంటిఫిక్ అమెరికన్‌లో ప్రచురించబడింది.
అతని స్నేహితులు, సహచరుల కృషి కారణంగా, 1964 జూన్‌లో కోశాంబి పూణేలోని మహారాష్ట్ర విద్యాన్వర్ధినితో అనుబంధంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కి సైంటిస్ట్ ఎమిరిటస్‌గా నియమితుడయ్యాడు. అతను అనేక చారిత్రక, శాస్త్రీయ, పురావస్తు ప్రాజెక్టులపై (పిల్లల కోసం కథలు కూడా రాయడం) కృషిచేసాడు. కానీ ఈ కాలంలో అతను చేసిన చాలా రచనలు అతని జీవితకాలంలో ప్రచురించలేదు.
మరణం
కోశాంబి, 58 ఏళ్ల వయస్సులో, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణంగా 1966 జూన్ 29 తెల్లవారుజామున మరణించాడు. దానికి ముందు రోజే, అతను ఫిట్‌గా ఉన్నట్లుగా అతని కుటుంబ వైద్యుడు ప్రకటించాడు.
1980 లో భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ వారు మరణానంతరం హరి ఓం ఆశ్రమ అవార్డుతో సత్కరించారు.
అతని స్నేహితుడు బాషం, అతనికి ఇలా శ్రద్ధాంజలి ఘటించాడు:
- మొదట అతనికి మూడు ఆసక్తులు మాత్రమే ఉన్నాయని అనిపించింది, మరే ఆస్కతికీ చోటు లేఖుండా అతని జీవితాన్ని నింపేసాయి - ప్రాచీన భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలు, గణితశాస్త్రం, శాంతిని కాపాడటం. ఈ చివరిదాని కోసం, అలాగే తన రెండు మేధో ప్రయోజనాల కోసం, తన లోతైన విశ్వాసాల ప్రకారం కష్టపడి ఇష్టపడి పనిచేశాడు. అతని గురించి లోతుగా తెలుసుకునేకొద్దీ అతని హృదయం, మనస్సుల పరిధి చాలా విస్తృతమైనదని గ్రహించేవారు ... అతని జీవితంలోని తరువాతి సంవత్సరాల్లో, చరిత్ర పునర్నిర్మాణంలో ఒక సాధనంగా మానవ శాస్త్రంపై అతని దృష్టి మళ్లినప్పుడు, మహారాష్ట్రలోని సాధారణ ప్రజల జీవితాల పట్ల ఆయనకు గల లోతైన సహానుభూతి గురించి స్పష్టంగా తెలిసింది.[7]
కోశాంబి వృత్తి రీత్యా చరిత్రకారుడు కానప్పటికీ, అతను చరిత్రపై నాలుగు పుస్తకాలు, అరవై వ్యాసాలు రాశాడు: ఈ రచనలు భారతీయ చరిత్ర చారిత్రికతపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.[8] అతను చరిత్రను కేవలం "ఎపిసోడ్‌లు" లేదా రాజులు, యోధులు లేదా సాధువుల వంటి గొప్ప వ్యక్తుల యొక్క కాలానుగుణ కథనం కాకుండా సామాజిక-ఆర్థిక నిర్మాణాల డైనమిక్స్ పరంగా అర్థం చేసుకున్నాడు. అతని క్లాసిక్ రచన, భారతీయ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం మొదటి పేరాలో, అతను పురాతన భారతీయ చరిత్రపై తన జీవిత రచనకు పూర్వరంగంగా తన పద్దతిపై అంతర్దృష్టిని ఇచ్చాడు:
"భారతదేశంలో కొన్ని ఎపిసోడ్‌లు ఉన్నాయి, కానీ చరిత్ర లేదు" అనే వెటకారం భారతదేశ గతం గురించి విదేశీ రచయితలకు అధ్యయనం చెయ్యకపోవడాన్ని, అవగాహన, తెలివితేటలు లేకపోవడాలను సమర్థించుకోడానికి మాత్రమే పనికొస్తుంది. భారత రికార్డుల్లో లేనివే ఈ ఎపిసోడ్లని - రాజవంశాలు, రాజుల జాబితాలు, పాఠశాల పాఠాలను నింపే యుధ్ధాల కథలు - అనంతర పరిశీలనల్లో తేలుతుంది. ఇక్కడ, మొట్టమొదటిసారిగా, మనం ఎపిసోడ్‌లు లేకుండా చరిత్రను పునర్నిర్మించవలసి ఉంటుంది. దానర్థం, ఇది ఐరోపా రకపు చరిత్ర లాగా ఉండకూడదు."[9]
AL బాషమ్ ప్రకారం, " భారతీయ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం అనేక అంశాలలో ఒక యుగపు రచన, దాదాపు ప్రతి పేజీలో అద్భుతమైన అసలైన ఆలోచనలు ఉంటాయి; దానిలో లోపాలు, తప్పుడు వివరణలు ఏమైనా ఉన్నా, దాని రచయిత తన డేటాను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినా, అవేవీ చాలా ఉత్తేజకరమైన ఈ పుస్తకపు ప్రాముఖ్యతను తగ్గించవు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తించింది."[10]
ప్రొఫెసర్ సుమిత్ సర్కార్ ఇలా అంటాడు: "1950లలో DD కోశాంబితో ప్రారంభమైన భారతీయ చరిత్ర చారిత్రికత, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలతో సమానంగా కొండొకచో వాటికంటే ఉన్నతమైనదిగా గుర్తించబడింది."[11]
నేచర్‌లో ప్రచురించబడిన కోశాంబి సంస్మరణలో, JD బెర్నాల్ కోశాంబి ప్రతిభను ఈ క్రింది విధంగా సంగ్రహించాడు: "కోశాంబి చారిత్రక పాండిత్యంలో ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు, ముఖ్యంగా ఆధునిక గణిత శాస్త్రాన్ని ఉపయోగించడం ద్వారా. నాణేల బరువుల గణాంక అధ్యయనం ద్వారా కోశాంబి, అవి చెలామణిలో ఉన్నది ఎంత కాలం కిందటో నిర్ణయించ గలిగే వాడు."