కానాల శ్రీహర్ష చక్రవర్తి
మూస:సమాచారపెట్టె వ్యక్తి కానాల శ్రీహర్ష చక్రవర్తి గణితావధాని. కాగితం, కలం, కాలిక్యులేటర్, కంప్యూటర్లు లేకుండానే గణితం- ఖగోళం- కంప్యూటర్ గణితానికి చెందిన క్లిష్టాతిక్లిష్టమైన సమస్యలకు క్షణాల్లో సమాధానమివ్వడంలో శ్రీహర్ష దిట్ట. ప్రపంచ ప్రప్రథమ మహాగణిత శతావధానిగా పేరుగడించాడు.
బాల మేధావి
పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే శ్రీహర్ష అభినవ ఆర్యభట్ట, సరస్వతీ పుత్ర, ఉద్దండ బాలభాస్కర వంటి 26 బిరుదాంకితాలను కైవసం చేసుకున్నాడు. ఇప్పటికి 95 గణిత అవధానాలు, 2 మహా గణిత శతావధానాలు చేసి 155 సన్మానాలు పొందాడు. లేత వయసు నుంచే గణితంలో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ వండర్ చైల్డ్‌గా కితాబుపొందాడు. తెలుగుజాతి గర్వించదగిన గణిత మేధావి శ్రీహర్ష.
జీవిత విశేషాలు
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కానాల నలచక్రవర్తి, లక్ష్మీ దంపతులకు జన్మిచాడు. ఆయన తండ్రి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలో రీడర్ గా పనిచేసేవాడు.[1] శ్రీహర్ష బాల్యం నుంచి గణిత అవధానములు చేయడంలో దిట్ట. ఖగోళ శాస్త్రాన్ని ఆపోశన పట్టాడు. ఇంగ్లీషు కాలెండరు ప్రకారం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో సూర్యుడు ఎప్పుడు ఏ రాశిలోప్రవేశిస్తాడో సశాస్త్రీయంగా చెప్పగలిగాడు. సాయన విధానంలో చంద్రుని కొమ్ము ఏరోజున ఏ దిశలో పైకి ఉంటుందో, ఏ రోజున సమానంగా ఉంటుందో కూడా వివరిస్తాడు. సూర్య, చంద్రుల గమన వేగాన్ని అనుసరించి అన్ని కాలాల్లోనూ తిథుల్ని లెక్కించగలడు. సృష్టి ప్రారంభ కాలం నుండి ఈ నాటి వరకు రోజులు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, బ్రహ్మాకాలం అన్ని లెక్కలూ నిమిష కాలంలో చెప్పగలడు. ఖగోళ శాస్త్రంలోని లోతైన అంశాలలో శతావధానం చేసాడు.[2]
గణిత శాస్త్రంలో సాటిలేని మేధావి. గంట వ్యవథిలో వెయ్యి గుణకారాలు, వెయ్యి కూడికలు, వెయ్యి తీసివేతలు, వెయ్యి భాగహారాలూ అవలీలగా చేస్తాడు. 17వ యేటకే గణిత శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో మొత్తం 16 పుస్తకాలు రాసాడు. ద్విసంఖ్యామానం, సప్తాంశమానం, ద్వాదశాంశమానం, 1తో గుణకార వింతలు, 2తో గుణకారవింతలు, 3తో గుణకార వింతలు, ఖగోళ శాస్త్రంలో అధికమాస దృశ్యమాలిక, ఆయనాంశం-ఒకపరిశీలన, అహర్గణ వివరాలు, ఖగోళశాస్త్రం మర్మాలు, మొదలగునవి రాసాడు. అనేకమంది మేధావులు, విద్యావేత్తల ప్రశంసలనందుకొని "అంతర్జాతీయ మేథావి"గా గుర్తింపు పొందాడు.[2]
13వ యేట వరంగల్ లో అష్టావధానం[3]
సెప్టెంబరు 16 2000 న తన 13 వ యేట వరంగల్ లో అష్టావధానం చేసారు. అందులో కొన్ని పృఛ్చకుల ప్రశ్నలు, శ్రీహర్ష సమాధానాలు:
- మూస:Pi విలువకు 50 దశాంశాల వరకు శ్లోకం ద్వారా చెప్పారు.
- జవహర్ లాల్ నెహ్రూ యొక్క జన్మదినం యొక్క వారం వెంటనే చెప్పారు.
- డిసెంబరు 31 1944 రోజు ఏ వారం? జ."బుధవారం"
- మూస:Math (172 యొక్క నాల్గవ ఘాతం) విలువ ఎంత? జ. 87,52,13,056
- మే 2 1970 న గల తిథి ఏమిటి? జ. ఏకాదశి.
- విలువ ఎంత? జ.182.
- డిసెంబరు 31,1944 రోజున ఏ తిథి? జ. పాడ్యమి.
అవార్డులు, గౌరవాలు
ఆయన "క్వాలిటీ మిలీనియం సూపర్ కిడ్"గా 2000 లో ఘనకీర్తిని పొందాడు. 2005 నాటికి 100 గణితావధానాలు చేసాడు. 22 బిరుదులు సంపాదించాడు. 150 కి పైగా సన్మానాలందుకున్నాడు.ఆయనకు "ఉద్దండ బాలభాస్కర", "అభినవ ఆర్యభట్ట", "సప్తగిరి సరస్వతీ పుత్ర", "సూపర్ కిడ్" మొదలగు బిరుదులు వచ్చాయి.[4]