24 (సంఖ్య)
Jump to navigation
Jump to search

Shubham 24 (ఇరవై నాలుగు) అనగా 23 తరువాత, 25 ముందు వచ్చే సహజ సంఖ్య. ఇది 2, 3, 4, 6, 8, 12 చే భాగింపబడుతుంది. 1024 కు ఎస్.ఐ.పూర్వలగ్నం "యొట్టా" దీనిని "Y"తో సూచిస్తారు. అదే విధంగా 10−24 ( 1024 కు వ్యుత్క్రమం) ను యోక్టో (y) అంటారు. ఇప్పటికి ఎస్.ఐ విధానంలో ఈ సంఖ్యలే గరిష్ఠ, కనిష్ఠ సంఖ్యలుగా ఉననయి.
గణితంలో
- 24, 4 యొక్క క్రమగుణితం. అనగా 24=4!. 24 సంయుక్త సంఖ్య. ఇది అనగా ఒక ప్రధాన బేసి సంఖ్య అయ్యేటట్లు రాయబడిన రూపంలోని మొదటి సంఖ్య.
- ఎనిమిది కచ్చితమైన భాజకాలు ఉన్న సంఖ్యలలో చిన్నది. దాని భాజకాలు, 1,2,3,4,6,8,12,24.
- దాని భాజకాలలో ఏదైనా సంఖ్యలో 1 తీసివేస్తే (1,2 తప్ప) అవి ప్రధాన సంఖ్యలు అవుతాయి.[1]
- 24 నోనాగోనల్ సంఖ్య.[2]
- రెండు కవల ప్రధాన సంఖ్యల మొత్తం 24. (24=11+13)
- 24 అనేది హర్షాద్ సంఖ్య.[3]
- ఏవేనీ వరుస నాలుగు సంఖ్యల లబ్ధం 24 చే భాగించబడుతుంది.
సైన్స్ లో
- క్రోమియం యొక్క పరమాణు సంఖ్య
- ఒక రోజులో గంటల సంఖ్య
- 24! విలువ సుమారు అవగాడో స్థిరాంకానికి సమానంగా ఉంటుంది.
ఇతర
- 24 క్యారెట్ల సంఖ్య 100% స్వచ్ఛమైన బంగారమును సూచిస్తుంది.
- 24 అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఒక పాపులర్ టెలివిజన్ షో యొక్క పేరు కూడా.