గూగోల్ ప్లెక్స్

గూగోల్ ప్లెక్స్ అనునది ఒక సంఖ్య దీనిని 10googol, లేదా. . అని వ్రాస్తారు. 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!
చరిత్ర
1920 లో, ఎడ్వర్డ్ కాస్నర్ యొక్క తొమ్మిదేళ్ల మేనల్లుడు, మిల్టన్ సిరోటా, గూగోల్ అనే పదాన్ని 10100 అని పిలిచాడు, తరువాత గూగోల్ ప్లెక్స్ అనే పదాన్ని "ఒకటి, తరువాత మీరు అలసిపోయే వరకు సున్నాలు రాయడం" అని ప్రతిపాదించాడు.[1] కాస్నర్ మరింత అధికారిక నిర్వచనాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే "వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో అలసిపోతారు. ఇటాలియన్ బాక్సర్ కార్నెరా ఐన్‌స్టీన్ కంటే మంచి గణిత శాస్త్రజ్ఞుడు ఎందుకంటే ఎందుకంటే అతనికి ఎక్కువ ఓర్పు ఉంది , ఎక్కువ కాలం వ్రాయగలడు."[2] అందువలన ఇది 10మూస:Supగా ప్రామాణికరించారు.
పరిమాణం
ఒక సాధారణ పుస్తకాన్ని 10మూస:Sup సున్నాలతో ముద్రించవచ్చు (ప్రతీ పేజీకి 50 వరుసలు, ఒక్కో వరుసకు 50 సున్నాలు కలిగినవి 400 పేజీలు). అందువలన అటువంటి 10మూస:Sup పుస్తకాలు గూగోల్‌ప్లెక్స్ సున్నాలతో ముద్రిస్తే, ప్రతీ పుస్తకం ద్రవ్యరాశి 100 గ్రాములు అయితే, అన్ని పుస్తకాల మొత్తం ద్రవ్యరాశి 10మూస:Sup కిలోగ్రాములు అవుతుంది. భూమి ద్రవ్యరాశి 5.972 x 10మూస:Sup కిలోగ్రాములయితే, పాలపుంత గాలక్సీ ద్రవ్యరాశి సుమారు 2.5 x 10మూస:Sup కిలోగ్రాములు. మనం గమనించిన విశ్వం మొత్తం ద్రవ్యరాశి 1.5 x 1053 కిలోగ్రాములుగా అంచనా వేయబడింది. అంతకన్నా మనం రాసిన పుస్తకాల ద్రవ్యరాశి అనేక రెట్లు అవుతుంది.
మూలాలు
బయటి లంకెలు
- ↑ మూస:Cite journal (retrieved March 17, 2015)
- ↑ Edward Kasner & James R. Newman (1940) Mathematics and the Imagination, page 23, NY: Simon & Schuster