నూనెలోని తేమ శాతం

testwiki నుండి
imported>రుద్రుడు చెచ్క్వికి (WPCleaner v2.05 - Fix errors for CW project (Tag with incorrect syntax - Missing end tag)) చేసిన 05:37, 20 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో,అలాగే అయిల్ కేకు(oil cakes)లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు

నూనె లోని తేమను నిర్ణయించు పద్ధతులు/పరీక్షలు[1]

నూనె లోని తేమశాతాన్ని మూడు పద్ధతులలో చెయ్యుదురు.

1.ఎయిర్ ఒవన్(oven) విధానం.

2.హట్ ప్లేట్ విధానం

3.డిస్టిలేసన్ విధానం.

ఎయిర్ ఒవన్ విధానం

తేమను నిర్ణయించు విధానాన్ని నూనె గింజలలోని తేమశాతంను నిర్ణయించు పద్ధతిలోనే చెస్తారు.ఇక్కడ నూనె గింజ లకు బదులు నూనెను పెట్రిడిష్‍లో తీసుకొవాలి.అయితే పెట్రి డిష్ లో నూనెను వేయుటకు ముందు నూనెను బాగా కలిపి ఆ తరువాత పెట్రి డిష్ లో పోసి, తూచాలి. మిగతా ప్రయోగ విధానం, ఇక్వెసన్ ఫార్ములా రెండింటికి సమానం.

హట్‍ప్లేట్(hot Plate) విధానం

ఈ పద్ధతిలో పరీక్షించవలసిన నూనెను ఒక బీకరులో తీసుకొని, హట్‍ప్లెట్ మిద వేడిచేస్తూ, గాజుకడ్డితో కలియతిప్పుచు, నూనెలోని తేమను తొలగించెదరు.ఈ పద్ధతిలో నూనెలోని తేమశాతాన్ని కొద్ది నిమిషాలలోనే (25-30నిమిషాలు) నిర్ణయించవచ్చును.ఎయిర్ ఒవన్ పద్ధతిలో 3-4 గంటల సమయం పట్టును.అయితే ఈ విధానంలో తుది పరీక్ష విలువలో ఖచ్చితత్త్వం కొద్దిగా తక్కువ.త్వరగా నూనెలోని తేమ శాతం అందాజుగా తెలుసుకొనుటకు పనిచేయును.

పరికరాలు 1.గాజుబీకరు:100-150మి.లీ.కెపాసిటి ఉంది.

2.గాజు కడ్డి

3.డెసికెటరు

4.విద్యుతో పనిచేయు హాట్‍ప్లేట్

5.ఎనలైటికల్ బాలెన్స్

పరీక్షించు విధానం

శుభ్రమైన, పొడిగా వున్న 100-150 మి.లీ.ల గాజు బీకరును ఒక గాజు కడ్డితో సహ తీసుకొని, తూచి వాటి భారాన్ని నమోదు చేయాలి.పరీక్షించవలసిన నూనెను బాగా కలియబెట్టి అందునుండి దాదాపు 10 గ్రాం.ల వరకు నూనెను బీకరులో వేసి, తూచి భారాన్ని నమోదు చెయ్యాలి.బీకరును హట్‍ ప్లేట్ మీద వుంచి,హీటరును ఆన్ చెయ్యాలి.గాజు కడ్డితో బీకరులోని నూనెను కలియబెట్టుచు నూనెను 120 డిగ్రీలవరకు వేడి చెయ్యాలి.మొదట బీకరులోని నూనె నుండి తేమ చిన్న గాలిబుడగలవలె తయారై నూనె ఉపరితలం చేరును.నూనెనుండి పూర్తిగా బుడగలు రావడం ఆగేవరకు నూనెను వేడిచేస్తూ, గాజుకడ్డితో నూనెను కలియబెట్టుచూ వుండాలి.కలియబెట్టునప్పుడు నూనె బయటకు చిందకుండ జాగ్రత్తగా కలియ బెట్టాలి.గాలి బుడగలు రావడం ఆగిపొగానే నూనెను వేడి చెయ్యడం నిలిపి వేసి బీకరును గాజుకడ్డితో సహా డెసికెటరులో వుంచి చల్లార్చాలి.చల్లారిన బీకరును బయటకు తీసి, ఎనలైటికల్ బాలెన్స్ లో తూచి భారాన్ని నమోదు చేయాలి.

తేమ శాతం సమీకరణం

=(W1W2)X100W1W

వివరణ

W=ఖాళి బీకరు+ గాజుకడ్ది బరువు.గ్రాం.లలో

W1=పరీక్షించు నూనె+బీకరు+గాజుకడ్డి బరువు, గ్రాం.లలో

W2=హట్‍ప్లెట్ మీద వేడి చేసిన తరువాత నూనె+ బీకరు+ గాజుకడ్ది బరువు, గ్రాం.లలో

పొటొ గ్యాలరి

దస్త్రం:Oil 046.jpg
డిజిటల్ బాలెన్స్ లో నూనెను బీకరులో నూనెను తూచడం
దస్త్రం:Oil 040.jpg
హట్‍ ప్లెట్ మీద నూనెను గాజుకడ్దితో కలియబెట్టుచు వేడిచేస్తున్న దృశ్యం

మూలాలు/ఆధారాలు

మూస:మూలాలజాబితా

  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.

మూస:నూనెలను పరీక్షించడం

  1. Indian Standards,Methods of Sampling and test for oils and fats,IS:(partI)-1964.Determination of Moisture content,PagenO:18