బౌలింగు సగటు

testwiki నుండి
imported>K.Venkataramana (వర్గం:క్రికెట్ పదజాలం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)) చేసిన 14:40, 13 సెప్టెంబరు 2023 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

మూస:Best Test career bowling averages

George Lohmann
టెస్ట్ క్రికెట్‌లో కనీసం 600 బంతులు వేసిన బౌలర్లలో, జార్జ్ లోమాన్ కి అత్యల్ప బౌలింగు సగటు, 10.75 ఉంది. [1]

క్రికెట్‌లో, ఒక ఆటగాడి బౌలింగు సగటు అనేది ఒక వికెట్‌కు అతను ఇచ్చిన పరుగుల సంఖ్య. బౌలింగు యావరేజ్ ఎంత తక్కువగా ఉంటే బౌలరు అంత మెరుగ్గా రాణిస్తున్నట్లు లెక్క. బౌలర్లను పోల్చడానికి ఉపయోగించే అనేక గణాంకాలలో ఇది ఒకటి. సాధారణంగా బౌలరు మొత్తం పనితీరును అంచనా వేయడానికి ఎకానమీ రేట్, స్ట్రైక్ రేట్‌లతో పాటు దీన్నీ ఉపయోగిస్తారు.

బౌలరు తీసుకున్న వికెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, అతని బౌలింగు సగటు కృత్రిమంగా ఎక్కువ గానో, తక్కువ గానో ఉండే అవకాశం ఉంటుంది, అస్థిరంగా కూడా ఉంటుంది. ఆ తరువాత తీసుకునే వికెట్లు, ఇచ్చే పరుగులను బట్టి వారి బౌలింగు సగటులో పెద్ద మార్పులు జరుగుతాయి. దీని కారణంగా, అత్యుత్తమ బౌలింగు సగటులున్న ఆటగాళ్లను నిర్ణయించేటప్పుడు సాధారణంగా, కొన్ని అర్హత పరిమితులను వర్తింపజేస్తారు. ఈ ప్రమాణాలను వర్తింపజేసిన తర్వాత పరిశీలిస్తే, జార్జ్ లోమాన్‌కు టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప బౌలింగు సగటు రికార్డు ఉంది. అతను ఒక్కో వికెట్‌కు 10.75 పరుగులు ఇచ్చి, 112 వికెట్లు తీసుకున్నాడు.

లెక్కింపు

బౌలరు ఇచ్చిన పరుగుల సంఖ్యను, వారు తీసుకున్న వికెట్ల సంఖ్యతో భాగిస్తే బౌలింగు సగటు వస్తుంది.[2] బైలు, లెగ్ బైలు, [3] లేదా పెనాల్టీ పరుగులను మినహాయించి, బౌలరు బౌలింగు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు చేసిన మొత్తం పరుగుల సంఖ్యను బౌలరు ఇచ్చిన పరుగుల సంఖ్యగా తీసుకుంటారు.[4] బౌల్డ్, క్యాచ్, హిట్ వికెట్, లెగ్ బిఫోర్ వికెట్ లేదా స్టంపౌటౌన వికెట్లు బౌలరు ఖాతా లోకి వస్తాయి.[5]

Bowlingaverage=RunsconcededWicketstaken

ఈ గణాంకాంశంలో అనేక లోపాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది - అసలు ఒక్క వికెట్టు పడని బౌలరుకు బౌలింగు సగటు ఉండదు. ఎందుకంటే సున్నాతో భాగిస్తే ఫలితం రాదు కాబట్టి. దీని ప్రభావం ఏమిటంటే, అసలు ఒక్క వికెట్టు కూడా తీసుకోని బౌలరు ఒక్క పరుగు ఇచ్చినా, 100 పరుగులు ఇచ్చినా బౌలింగు సగటు మారదు. బౌలింగు సగటు కూడా బౌలరు యొక్క సామర్థ్యానికి నిజమైన ప్రతిబింబం ఇవ్వదు, వారు తీసిన వికెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి వారు ఇచ్చిన పరుగుల సంఖ్యతో పోలిస్తే. [6] బ్యాటర్లు బౌలర్ల గణాంకాలను నిర్ణయించేండుకు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తూ తన పేపర్‌లో, పాల్ వాన్ స్టాడెన్ దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాడు:

ఒక బౌలరు మొత్తం 80 బంతులు వేసి, 60 పరుగులిచ్చి, కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడనుకుందాం.. అప్పుడతని సగటు 30. ఆ బౌలరు వేసిన తర్వాతి బంతికి ఒక వికెట్ తీసుకుంటే (పరుగులు ఇవ్వలేదనేది స్పష్టం), అప్పుడు సగటు ఠక్కున 20 కి పడిపోతుంది. [6]

ఈ కారణం వలన, బౌలింగు సగటుల రికార్డులను స్థాపించేటప్పుడు, అర్హత ప్రమాణాలను విధిస్తారు. టెస్ట్ క్రికెట్ కోసం, విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ ఈ అర్హతను 75 వికెట్లుగా నిర్ణయించింది.[7] ESPNcricinfo కనీసం 2,000 డెలివరీలు వేసి ఉండాలనేది అర్హతగా పెట్టుకుంది.[8] వన్డే క్రికెట్‌కు కూడా ఇలాంటి పరిమితులను విధించారు. [9] [10]

వైవిధ్యాలు

పూర్తిగా బౌలరు సామర్థ్య స్థాయి కాకుండా అనేక అంశాలు ఆటగాడి బౌలింగు సగటుపై ప్రభావం చూపుతాయి. వీటిలో చాలా ముఖ్యమైనవి క్రికెట్ ఆడిన కాలం. టెస్టు, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బౌలింగు సగటు పట్టికల్లో పందొమ్మిదవ శతాబ్దంలో ఆడిన ఆటగాళ్ళు అగ్రశ్రేణిలో ఉంటారు.[11] ఈ కాలంలో పిచ్‌లు కప్పి ఉంచేవాళ్లు కాదు. కొన్ని ఎంత దారుణంగా ఉండేవంటే, వాటిపై రాళ్ళు పైకితేలి ఉండేవి. వర్ణవివక్ష కాలంలో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయేతర ఆటగాళ్లకు మాత్రమే పరిమితమైన హోవా బౌల్‌ పోటీల్లో పిచ్ దారుణంగా ఉండేది.[12] విన్సెంట్ బర్న్స్, "మేము ఆడిన చాలా వికెట్లు సరిగా చదును చేసేవారు కాదు. బౌలరుగా నాకు అది చాలా బాగుండేది." అన్నాడు. [13] ఆ యుగంలో బౌలర్లకు ప్రయోజనాన్ని అందించిన ఇతర అంశాల్లో ముఖ్యమైనవి - బ్యాటింగ్ గ్లౌజులు హెల్మెట్‌లు వంటి భద్రతా పరికరాలు లేకపోవడం, తరచూ బాగా బలమైన జట్టు, బాగా బలహీనమైన జట్టుతో ఆడడం, క్రికెట్ చట్టాలలో మార్పులు, మ్యాచ్‌ల నిడివి వగైరాలు.[14]

రికార్డులు

మూస:Best Test career bowling averagesవివిధ గణాంక నిపుణులు రికార్డులపై విధించిన వివిధ అర్హత పరిమితుల కారణంగా, కెరీర్‌లో అత్యల్ప బౌలింగు సగటు రికార్డులు ఒక్కో ప్రచురణలో ఒక్కో రకంగా ఉంటాయి.

టెస్ట్ క్రికెట్

టెస్ట్ క్రికెట్‌లో, విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్, ESPNcricinfo, క్రికెట్ ఆర్కైవ్‌లలో జార్జ్ లోహ్‌మాన్ అత్యుత్తమ సగటు ఉంది. ఈ మూడూ వేర్వేరు పరిమితులను ఉపయోగిస్తున్నప్పటికీ, లోమాన్ సగటు 10.75 ఉత్తమమైనదిగా పరిగణించాయి. [1] [7] [8] అర్హత ప్రమాణాలేమీ వర్తింపజేయకపోతే, ముగ్గురు ఆటగాళ్ళు- విల్ఫ్ బార్బర్, AN హార్న్‌బీ, బ్రూస్ ముర్రే- ఒకే అత్యుత్తమ సగటుతో సమానంగా ఉంటారు. ఈ ముగ్గురూ టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకుని, పరుగులేమీ ఇవ్వకుండా, సున్నా సగటు సాధించారు. [15]

ESPNcricinfo జాబితాలో బెట్టీ విల్సన్ 11.80తో అత్యుత్తమ మహిళల టెస్ట్ క్రికెట్ సగటును కలిగి ఉంది, [16] క్రికెట్ ఆర్కైవ్ మేరీ స్పియర్ సగటు 5.78 ను అత్యుత్తమంగా చూపింది. [17]

వన్ డే ఇంటర్నేషనల్స్

వన్ డే ఇంటర్నేషనల్స్‌లో, ESPNcricinfo, CricketArchive లు నిర్దేశించుకున్న వివిధ ప్రమాణాల ప్రకారం ఒకే ఆటగాడికి ఈ రికార్డు ఉంది. ESPNcricinfo పరిమితి కొంత కఠినంగా ఉంది - కనీసం 1,000 బంతులు వేసిన వాళ్ళనే అది పరిగణిస్తుంది. క్రికెట్ ఆర్కైవ్‌ వారు 400 డెలివరీల పరిమితిని పరిగణించారు. ఈ రెండింటి లోనూ, సందీప్ లామిచానే 15.57 సగటుతో రికార్డు సాధించాడు. [9] [18]

మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, కరోలిన్ బార్స్ 9.52 సగటుతో క్రికెట్ ఆర్కైవ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, [19] కానీ ESPNcricinfo యొక్క కఠినమైన మార్గదర్శకాల ప్రకారం, గిల్ స్మిత్ 12.53 తో ఈ రికార్డును కలిగి ఉంది. [20]

T20 ఇంటర్నేషనల్స్

ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ కోసం పై రెండు వెబ్‌సైట్‌ల రికార్డులు భిన్నంగా ఉన్నాయి; ESPNcricinfo పరిమితి కొద్దిగా తక్కువగా ఉంది - కేవలం 30 బంతులు వేస్తే చాలు. ఆ ప్రమాణాల ప్రకారం 8.20 సగటుతో జార్జ్ ఓ'బ్రియన్‌కు అత్యుత్తమ సగటు రికార్డు ఉంది. అయితే క్రికెట్ ఆర్కైవ్‌కు మరింత కఠినమైన 200 డెలివరీల పరిమితి ప్రకారం ఆండ్రీ బోథా 8.76 సగటుతో అత్యుత్తమంగా ఉన్నాడు. [10] [21]

ఫస్ట్ క్లాస్ క్రికెట్

దేశీయంగా, ఫస్ట్-క్లాస్ క్రికెట్ రికార్డుల్లో పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఆటగాళ్ళకే ఆధిపత్యం ఉంది. ESPNcricinfo వారి 5,000 డెలివరీల ప్రమాణాల ప్రకారం మొదటి ఇరవై మందిలో పదహారు మంది ఆ కాలానికి చెందినవారే ఉన్నారు. 1825 నుండి 1853 వరకు చురుగ్గా ఉన్న విలియం లిల్లీవైట్‌కు అత్యల్ప సగటు ఉంది -అతను కేవలం 1.54 సగటుతో 1,576 వికెట్లు సాధించాడు. ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లు స్టీఫెన్ డ్రై, విన్సెంట్ బర్న్స్ ల సగటు పన్నెండు కంటే తక్కువ. [11] వీరిద్దరూ వర్ణవివక్ష కాలంలో దక్షిణాఫ్రికా హోవా బౌల్ టోర్నమెంట్‌లోనే తమ వికెట్లలో ఎక్కువ భాగం సాధించారు. [22] [23]

ఇవి కూడా చూడండి

  • బ్యాటింగు సగటు (క్రికెట్)
  • స్ట్రైక్ రేటు

ప్రస్తావనలు