నిరోధకం

testwiki నుండి
imported>రుద్రుడు చెచ్క్వికి (WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text - Whitespace characters after heading)) చేసిన 02:40, 4 ఏప్రిల్ 2023 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search
వివిధ నిరోధాల (రెసిస్టెన్స్) విలువలు గల నిరోధాలు (రెసిస్టర్లు)

నిరోధకం (Resistor) అనేది రెండు టర్మినళ్ళు కలిగిన ఒక విద్యుత్ ఉపకరణం. దీన్ని విద్యుత్ వలయంలో విద్యున్నిరోధం అంటే విద్యుచ్ఛక్తి ప్రవాహాన్ని, వోల్టేజీనీ నియంత్రించడం కోసం వాడతారు. నిరోధకాలు శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి విద్యుచ్ఛక్తిని ఉష్ణ శక్తిగా లేదా కాంతి శక్తిగా మారుస్తాయి. ఉదాహరణకు లైట్ బల్బులోని టంగ్ స్టన్ ఫిలమెంటు ఒక విద్యుత్ నిరోధం ఇది విద్యుత్తును కాంతిగా మారుస్తుంది. అలాగే హీటర్లోని నిరోధకం విద్యుత్తును ఉష్ణశక్తిగా మారుస్తుంది. అధిక విద్యుత్ నిరోధకాలు అనేక వాట్ల కరెంటును ఉష్ణశక్తిగా వెదజల్లడం వల్ల వాటిని మోటారు నియంత్రణ, విద్యుత్ సరఫరా వ్యవస్థ, జెనరేటర్లలో విరివిగా వాడతారు.written నరేష్ యాదవ్

సంకేతం

నిరోధాన్ని ఈ క్రింది సంకేతాలతో సూచిస్తారు.

నిరోధాల శ్రెణి సమాంతర సంధానాలు

శ్రేణి సంధానం

ఒక నిరోధం లోని రెండవ టెర్మినల్ ను రెండవనిరోధం లోనిమొదటి టెర్మినల్ కు, రెండవ నిరోధం లోని రెండవ టెర్మినల్ ను మూడవ నిరోధం లోనిమొదటి టెర్మినల్ కు ...... ఈ విధంగా నిరోధాలను కలిపినట్లయితే ఆ సంధానాన్ని నిరోధాల శ్రేణి సంధానం అంటారు. ఇందులో ఫలిత నిరోధం విడివిడి నిరోధాల మొత్తానికి సమానంగా ఉంటుంది.

నిరోధాలను శ్రేణి సంధానం చేయుట.

ఫలిత నిరోధం=Rtotal=R1+R2++Rn

శ్రేణిసంధానంలో ఫలిత నిరోధం

R1,R2,R3 నిరోధాలను శ్రేణి సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవాహంI స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాలు కూడా సామర్థ్య జనకం అయిన బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలమునుVని పంచుకుంటాయి. అనగా బ్యాటరీ యొక్క ధ్రువాల మధ్య పొటెన్షియల్ భేదంV, R1 నిరోధం రెండు చివరల మధ్య V1 పొటెన్షియల్ భేదం, R2 నిరోధం రెండు చివరల మధ్య V2 పొటెన్షియల్ భేదం, R3 నిరోధం రెండు చివరల మధ్య V3 పొటెన్షియల్ భేదంగా విభజించబడుతుంది. అనగా

V=V1+V2+V3 అవుతుంది.
ఓం నియమం ప్రకారం
V=IR
V1=IR1
V2=IR2
V3=IR3 అవుతుంది
అందువలన IR=IR1+IR2+IR3
IR=I(R1+R2+R3)
R=R1+R2+R3

సమాంతర సంధానం

నిరోధాల యొక్క మొదటి టెర్మినల్ లు ఒకవైపుకు రెండవ టెర్మినల్ నలు రెండవ వైపుకి కలిపినట్లయితే ఆ సంధానాన్ని సమాంతర సంధానం అంటారు.సమాంతర సంధానంలో ఫలిత నిరోధం యొక్క వ్యుత్క్రమం విడి విడి నిరోధాల వ్యుత్క్రమాల మొత్తానికి సమానంగా ఉంటుంది.

నిరోధాల సమాంతర సంధానం చేయు విధము

ఫలిత నిరోధం= :1R=1R1+1R2+...........................1Rn

సమాంతర సంధానంలో ఫలిత నిరోధం

R1,R2,R3 నిరోధాలను సమాంతర సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు నిరోధాల చివరల మధ్య పొటెన్షియల్ భేదంV స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాల గుండా విద్యుత్ ప్రవాహం iవిభజించబడుతుంది. అనగావలయంలో విద్యుత్ ప్రవాహంi, R1 నిరోధం గుండా i1 విద్యుత్ ప్రవాహం, R2 నిరోధం గుండా i2 విద్యుత్ ప్రవాహం, R3 నిరోధం గుండా i3 విద్యుత్ ప్రవాహంగా విభజించబడుతుంది. అనగా

i=i1+i2+i3 అవుతుంది.
ఓం నియమం ప్రకారం
i=VR
i1=VR1
i2=VR2
i3=VR3 అవుతుంది
అందువలన VR=VR1+VR2+VR3
VR=V(1R1+1R2+1R3)
1R=1R1+1R2+1R3