యానకం(కాంతి)

testwiki నుండి
imported>K.Venkataramana చేసిన 08:45, 8 జూన్ 2022 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

దృశా మాధ్యమం (యానకం) అంటే విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారం చేసే పదార్థం. ఈ తరంగాలు ఏ పదార్థాల గుండా ప్రయాణం చేస్తాయో ఆ పదార్థాలను యానకం అంటారు. ఇది ప్రసార మాధ్యమం యొక్క ఒక రూపం. మాధ్యమం పర్మిటివిటీ, ప్రవేశ్యశీలతలు విద్యుదయస్కాంత తరంగాలు ఎలా వ్యాపిస్తాయో నిర్వచిస్తాయి. మాధ్యమానికి స్వభావజ అవరోధం ఉంటుంది. దీనిని క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.

η=ExHy

దీనిలో Ex ,Hy లు వరుసగా విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలను సూచిస్తాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ వాహకత లేనప్పుడు పై సమీకరణం క్రింది విధంగా రాయవచ్చు.

η=με .

ఉదాహరణకు, శూన్య ప్రదేశంలో స్వభావజ అవరోధాన్ని "శూన్యం అవరోధ లక్షణం" గా పిలుస్తారు. దీనిని Z0 తో సూచిస్తారు. అపుడు,

Z0=μ0ε0 .

మాధ్యమం గుండా తరంగాలు cw=νλ (ఇందులో విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం ν , తరంగదైర్ఘ్యం λ అవుతుంది.) వేగంతో ప్రసారం చేయబడతాయి. ఈ సమీకరణాన్ని ఈ రూపంలో కూడా రాయవచ్చు:

cw=ωk ,

దీనిలో తరంగ కోణీయ పౌనఃపున్యం ω , తరంగ సంఖ్య k అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో β గుర్తు ను దశా స్థిరాంకం అందురు. ఇది తరచుగా k బదులుగా వాడతారు.

శూన్య ప్రదేశంలో విద్యుదయస్కాంత తరంగాల ప్రచారం వేగం, ఆదర్శవంతమైన ప్రామాణిక సూచన స్థితి (పరమ శూన్య ఉష్ణోగ్రత వంటిది), ఇది సాంప్రదాయకంగా c0 చే సూచించబడుతుంది[1].

c0=1ε0μ0 ,
దీనిలో ε0 విద్యుత్ స్థిరాంకం, μ0  అయస్కాంత స్థిరాంకం.

మూలాలు

మూస:Reflist

  1. With ISO 31-5, NIST and the BIPM have adopted the notation c0.